కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తిలో ముంబై వెళ్లి.. ఇటీవల గ్రామానికి వచ్చిన వ్యక్తికి కరోనా నిర్ధారణ అయింది. ఫలితంగా సమీప గ్రామాలు అప్రమత్తమయ్యాయి. స్వచ్ఛంద లాక్డౌన్ పాటించాలంటూ చాటింపు చేసుకుని.. ముందు జాగ్రత్తలు పాటిస్తున్నాయి.
మరోవైపు వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించాలంటూ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. బాధితునితో సన్నిహితంగా ఉన్న వారిని హోం క్వారంటైన్ చేశారు. చాటింపు ద్వారా సాధారణ అవసరాలు తగ్గించుకుని.. ప్రజలు కరోనా నియంత్రణకు ముందు జాగ్రత్తలు పాటిస్తున్నారు.