కరీంనగర్ నాకా చౌరస్తా వద్ద చోటు చేసుకున్న ఘటనతో పోలీసులు అవాక్కయ్యారు. లాక్డౌన్ సడలింపు సమయం ముగిసాక రోడ్లపై తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడకు ఎందుకు వచ్చారని పోలీసులు వారిని ఆరా తీయగా... అందులో ఒక యువకుడు ఐసోలేషన్లో బోర్ కొడుతోందని బయటికి వచ్చినట్లు చెప్పాడు.
మరో వ్యక్తి తనకు కరోనా సోకిందని మందుల కోసం బయటికి వచ్చినట్లు చెప్పాడు. నిజంగా అతను మందుల కోసం వచ్చాడో లేదో అని అతడి వద్ద ఉన్న మందుల చీటీని పోలీసులు పరిశీలించారు. నాలుగు రోజుల క్రితమే పాజిటివ్ వచ్చినట్లు నిర్ధరణ అయినట్లు తేలిందని పోలీసులు వివరించారు. వెంటనే వీరిద్దరినీ ఆటోలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి : Eatala: ఒక్క ఎకరం ఎక్కువ ఉన్నా ముక్కు నేలకు రాస్తా: ఈటల సతీమణి