కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కేశవాపూర్‌లో కరోనా కలకలం సృష్టించింది. మండలంలోని కేశవాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత నెల 23న బంధువుల వివాహ వేడుకలకు హాజరయ్యారు. రెండు రోజులు అదే గ్రామంలో ఉన్న సదరు కానిస్టేబుల్ తిరిగి హైదరాబాద్‌కు వెల్లినట్టు అధికారులు తెలిపారు.
కేశవాపూర్ కానిస్టేబుల్‌కు పాజిటివ్...
అక్కడ తనతో పాటు విధులు నిర్వర్తిస్తున్న మరో కానిస్టేబుల్‌కు కరోనా పరీక్షలు చేయగా పాజిటీవ్‌గా తేలింది. ఫలితంగా కేశవపూర్‌కు చెందిన కానిస్టేబుల్‌కు కూడా వైద్య పరీక్షలు చేసి కరోనా సోకినట్టు ధ్రువీకరించారు.
ఆసుపత్రికి ఏడుగురు.. హోం క్వారంటైన్కూ ఏడుగురు
కేశవాపూర్‌లో వివాహ వేడుకలకు కానిస్టేబుల్ హాజరైన సంగతి తెలుసుకున్న స్థానిక సీఐ సృజన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ రాజేశ్వర్‌రావు, వైద్య సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. కానిస్టేబుల్ ఎవరెవరిని కలిశాడనే వివరాలు సేకరించారు. ఏడుగురిని 108 అంబులెన్స్‌లో కరీంనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించగా మరో ఏడుగురిని గృహ నిర్బంధంలో ఉంచారు.
ఇవీ చూడండి : రాత్రి 8 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచే ఉంటాయి