కరీంనగర్ జిల్లా రామడుగు తహసీల్దార్ కార్యాలయంలో ఓ అధికారికి కరోనా సోకడం వల్ల తోటి ఉద్యోగుల్లో వైరస్ కలవరం మొదలైంది. శిక్షణలో ఉన్న ఆ అధికారి గత వారం రోజులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. స్వల్ప అస్వస్థతగా ఉండటం వల్ల ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చినందున ఆస్పత్రిలో చేరారు.
ఆ రెవెన్యూ కార్యాలయంలో వారం రోజులుగా విధులకు హాజరైన పది మంది ఉద్యోగులకు యాంటిజెన్ పరీక్షలు నిర్వహించారు. అందరికి నెగెటివ్‌గా రావడం వల్ల సిబ్బంది ఊపిరిపిల్చుకున్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్ కేసులు