ETV Bharat / state

Balmuri Venkat: సమస్యలపై పోరాడేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి: బల్మూరి వెంకట్ - బల్మూరి వెంకట్

తరతరాలకు ఆస్తులు కూడబెట్టుకున్న అభర్థులు ఒకవైపు ఉంటే.. మరోవైపు విద్యార్థి నాయకుడిగా ప్రజా సమస్యలపై పోరాడేందుకు తానున్నానని హుజూరాబాద్​ కాంగ్రెస్​ అభ్యర్థి బల్మూరి వెంకట్ అన్నారు. జమ్మికుంట పురపాలిక పరిధిలోని ధర్మారం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.

Congress huzurabad candidate balmuri venkat election campaign
హుజూరాబాద్​ కాంగ్రెస్​ అభ్యర్థి బల్మూరి వెంకట్
author img

By

Published : Oct 18, 2021, 4:23 PM IST

ముఖ్యమంత్రికి, ఈటలకు ఉన్న తగాదాల వల్లే ఈటల రాజేందర్​ రాజీనామా చేశారని హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ ఆరోపించారు. ప్రజా సమస్యల కోసం పోరాడేందుకు రాజీనామా చేసుంటే తాను ఆయన వెంటే నడిచేవాడినని అన్నారు. జమ్మికుంట పురపాలిక పరిధిలోని ధర్మారం గ్రామంలో ఆయన ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

పువ్వు, కారు గుర్తులతో మరోసారి ప్రజలను మోసగించేందుకు వస్తున్నారని మండిపడ్డారు. ఓ విద్యార్థి నాయకునిగా ప్రజా సమస్యలపై పోరాడేందుకు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మరో నాలుగు తరాలు తిన్నా తరగని ఆస్తులున్న వారు ఒకవైపు.. మరో 40 ఏళ్లు పోరాడే నాయకుడు మరోవైపు ఉన్నారని బల్మూరి వెంకట్ అన్నారు. ఓటర్లే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.

ఎన్నికలు ఉంటే తప్ప ముఖ్యమంత్రి బయటికి వచ్చే పరిస్థితి ఉండదని బల్మూరి వెంకట్ విమర్శించారు. అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగులు, రైతుల చావులు తగ్గలేదని ఆరోపించారు. భాజపా వాళ్లకు ఓటు వేస్తే నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ప్రచారంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణ రావు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

నిజాయతీ ఎటువైపు ఉందో మీరే ఆలోచించి ఓటేయ్యండి. ఈ ఎన్నికల్లో ప్రతి గడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాం. ఇవాళ పువ్వు గుర్తాయన వస్తుండు ప్రజల చెవుల్లో పువ్వు పెట్టడానికి. కారు గుర్తాయన వస్తుండు దళితులను కారుతో తొక్కించడానికి. నేను ఒక విద్యార్థి నాయకునిగా మీ ముందుకు వస్తున్నా. వాళ్లందరు కూడా తరతరాలు తిన్నా కూడా తరగని ఆస్తులు కూడబెట్టుకున్నరు. చేతి గుర్తోళ్లు మాత్రమే మీ సమస్యలపై పోరాడుతున్నరు. ఇవాళ ఈటల రాజేందరన్న ఆత్మగౌరవం కోసమే రాజీనామా చేశమంటున్నడు. కానీ ముఖ్యమంత్రికి, మీకు ఉన్న తగాదాల వల్లే మీరు పదవికి రాజీనామా చేసినవ్. ఉద్యోగాల కోసమో, దళితుల భూమి కోసమో, రుణమాఫీ కోసమో మీరు రాజీనామా చేసుంటే నేను కూడా మీ వెంట నడిచేవాడిని.-

బల్మూరి వెంకట్, హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి

హుజూరాబాద్​ కాంగ్రెస్​ అభ్యర్థి బల్మూరి వెంకట్ ఎన్నికల ప్రచారం

ఇదీ చూడండి: Minister Harish Rao : కేంద్రంలో కొట్లాట.. హుజూరాబాద్​లో మాత్రం కాంగ్రెస్​-భాజపాల దోస్తానా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.