ETV Bharat / state

congress defeated: కాంగ్రెస్ కకావికలం.. రేవంత్ క్రేజ్ ఏమైంది... ఓటర్లెందుకు చేయిచ్చారు? - తెలంగాణ కాంగ్రెస్​ వార్తలు

హుజురాబాద్ ఉపఎన్నిక (huzurabad by election) కాంగ్రెస్‌ పార్టీకి మరోసారి చేదు అనుభమే మిగిల్చింది (congress defeated in huzurabad by election). పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి సారథ్యంలో తొలి ఓటమిని చవిచూసింది (tpcc chief revanth reddy). హుజూరాబాద్​ ఉపఎన్నిక సందర్భంగా అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు ప్రతి దశలోను అంతంతమాత్రంగానే ఉన్న కాంగ్రెస్​... ఇవాళ వెలువడిన ఫలితాల్లోను ప్రభావం చూపలేకపోయింది. కనీసం పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది. ఒక్క అవకాశం అంటూ బరిలోకి దిగిన బల్మూరి వెంకట్​ కనీసం డిపాజిట్​ సాధించలేకపోయాడు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి సహా ఇతర ప్రధాన నేతలు ప్రచారం చేసినా.. ఓట్లు రాలలేదు. ప్రచార సమయంలో భారీగా తరలివచ్చి చేతులు ఎత్తిన జనం... ఓటు వేసే సమయానికి చేతులూపేశారు.

congress defeated
congress defeated
author img

By

Published : Nov 2, 2021, 8:25 PM IST

రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన హుజూరాబాద్​ ఉప ఎన్నిక (huzurabad by election) ఫలితాలు వెలువడ్డాయి. అనుకున్నట్టుగానే అధికార తెరాస, భాజపా మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చివరి రౌండ్​ వరకు నువ్వా నేనా అన్నట్లు వచ్చాయి. ఆఖరి రౌండ్​ వరకు గెలుపు ఇరువురి మధ్య దోబూచులాండింది. ఇక మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్​ అభ్యర్థి బల్మూరి వెంకట్​ కనీసం డిపాజిట్​ కూడా దక్కించుకోలేకపోయాడు (congress defeated in huzurabad by election). తొలిరౌండ్​ నుంచి వెనుకబడిన కాంగ్రెస్​కు ఏ రౌండ్​లోను కనీస మెజారిటీ రాలేదు. ఒక్క అవకాశం అంటూ బరిలోకి దిగిన బల్మూరి వెంకట్ (balmuri venkat)​... డిపాజిట్​ కోల్పోయాడు.

ఆది నుంచి అంతంత మాత్రంగానే..

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్​ రెడ్డి (tpcc chief revanth reddy) బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటగా వచ్చిన ఎన్నికలు కావడంతో... కాంగ్రెస్​ పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని అంతటా చర్చ జరిగింది. కానీ గతంలో హస్తం పార్టీ నుంచి బరిలోకి దిగి.. ఓటమిపాలైన కౌశిక్​ రెడ్డి.. హస్తం పార్టీని వీడి కారెక్కడంతో అక్కడ పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థి కరవయ్యారు. ఎన్నో చర్చలు, తర్జనభర్జనల తర్వాత విద్యార్థి సంఘం నాయకుడు బల్మూరి వెంకట్​ను బరిలోకి దింపారు. అయితే మొదట్లో ప్రచారం మాత్రం నిదానంగానే సాగింది. నామినేషన్ దాఖలు తర్వాత పార్టీ కీలక నేతలు అటువైపు చూడలేదు. ఈ క్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రచార బాధ్యతను తీసుకున్నారు. ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి భాజపా, తెరాస వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. చివర్లో ప్రచార సంగ్రామంలోకి దిగిన రేవంత్​ రెడ్డి సహా కీలక నేతలు ప్రచార సభలతో హోరెత్తించారు. రేవంత్​రెడ్డి తన మార్కు పదునైన విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రచార సభల్లో చప్పట్లు కొట్టించిన మాటలు... ఓట్లు రాలడంలో మాత్రం ప్రభావం చూపలేకపోయాయి.

ఫలించని వ్యూహం

భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్​పై (etela rajendar) పోటీకి దిగిన రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు విద్యార్థి సంఘాల నాయకులే. తెరాస తరఫున టీఆర్​ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్​ యాదవ్ (gellu Srinivas yadav)​ బరిలోకి దిగగా... కాంగ్రెస్​ కూడా అదే వ్యూహంతో ఆ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘమైన ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను ఖరారు చేసింది. కానీ అభ్యర్థికి బలమైన రాజకీయ అనుభవం లేకపోవడం, నియోజకవర్గంలో బలమైన కేడర్​ లేకపోవడంతో పాటు.. పోటీ చేస్తున్న అభ్యర్థి స్థానికేతరుడు కావడం సహా అన్ని అంశాలు కాంగ్రెస్​కు ప్రతికూలంగా మారాయి. మొదటి నుంచి అంతంత మాత్రంగానే ఉన్న కాంగ్రెస్​ ఫలితాల్లోను కనీస పోటీ ఇవ్వలేక చతికిలపడింది.

మ్యాచ్​ ఫిక్సింగ్​ అంటూ ఆరోపణలు

హుజురాబాద్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే వాదనలు ఉన్నాయి. ఉపపోరు కేవలం ఈటల రాజేందర్‌, తెరాస మధ్యేనని గాంధీభవన్‌ వర్గాలు అంచనా వేశాయి. అభ్యర్థి ఎంపిక ప్రక్రియ నుంచి ప్రచార సరళి పరిశీలించినా గెలుస్తామనే అంచనాలు వేసుకోలేదు. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ గెలిచినా అది అతని వ్యక్తిగత ప్రతిష్ఠగానే హస్తం పార్టీ అంచనా వేసిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌, భాజపా మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నాయని తెరాస ఆరోపించింది. ఈటలను రేవంత్‌రెడ్డి కలవడమే నిదర్శమని మంత్రి కేటీఆర్​ ఆరోపించారు.

కలిసిరాని ఉప ఎన్నికలు

2018 సార్వత్రిక ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపని కాంగ్రెస్​ పార్టీ.. ఆతర్వాత ఇప్పటి వరకు జరిగన నాలుగు ఉప ఎన్నికల్లోను పరాభవం మూటగట్టుకుంది. పీసీసీ మాజీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (uttam kumar reddy) హయాంలో అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ పరాభవం మూటగట్టుకుంది. ఇటీవల దుబ్బాక, హుజూర్‌నగర్‌లోనూ ఓటమి తప్పలేదు. జానారెడ్డి (Jana reddy) వంటి సీనియర్‌ నేత గెలుపుతోనైనా పుంజుకోవాలని భావించగా నిరాశే మిగిలింది. దుబ్బాకలో హస్తం అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి 22 వేల ఓట్లతో సరిపెట్టుకున్నారు. నాగార్జునసాగర్‌లో జానారెడ్డి సైతం 70, 932 ఓట్లు రాబట్టినా.. 18 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు సహా, స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు కలిసిరాలేదు.

ఇదీ చూడండి: Bandi sanjay on sircilla incident: 'తెరాస నాయకులు ఏం చేసినా చెల్లుతుంది.. సిరిసిల్ల ఘటనే నిదర్శనం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.