ETV Bharat / state

వీణవంకలో తెరాస, ఈటల వర్గాల మధ్య ఘర్షణ - etela followers arrest news

Conflict between  trs and Eetala followers in Veenavanka of karimnagar district

author img

By

Published : May 16, 2021, 4:13 PM IST

Updated : May 16, 2021, 10:14 PM IST

16:09 May 16

ఈటల వర్గీయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కరీంనగర్‌ జిల్లా వీణవంకలో తెరాస, ఈటల వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మండల కేంద్రంలో జమ్మికుంట వ్యవసాయ కమిటీ ఛైర్మన్​ బాలకిషన్​రావు తన అనుచరులతో ప్రెస్​మీట్​ పెట్టారు. ఈ క్రమంలో ఈటల వర్గీయులైన తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు మోటం వెంకటేష్‌, ఇల్లందకుంట దేవస్థానం కమిటీ సభ్యుడు దాసారపు రాజుతో పాటు రాయిశెట్టి కుమార్‌లు అక్కడికి చేరుకొని.. అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొవిడ్​ నిబంధనలు ఉల్లంఘిస్తూ... మధ్యాహ్నం సమయంలో ప్రెస్​మీట్​ పెట్టడమేంటని ప్రశ్నించారు.

 సమాచారం అందుకున్న పోలీసులు... హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇరువర్గాలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులతోనూ వాగ్వాదానికి దిగగా... ఈటల వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు. 

ఇదీ చూడండి: 120 ఏళ్ల క్రితమే దేశంలో లాక్​డౌన్

Last Updated : May 16, 2021, 10:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.