కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. హుజూరాబాద్-జమ్మికుంట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌పై పోలీసులు దాడfచేయటం దారుణమన్నారు. ఆందోళనకారులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ ఐకాస, విపక్ష నేతల సమావేశం