ETV Bharat / state

DALITHABANDHU: హుజూరాబాద్‌లో ఈనెల 27నుంచి పూర్తిస్థాయి సర్వే: రాహుల్‌ బొజ్జా - telangana varthalu

DALITHABANDHU: హుజూరాబాద్‌లో ఈనెల 27నుంచి పూర్తిస్థాయి సర్వే: రాహుల్‌ బొజ్జా

author img

By

Published : Aug 25, 2021, 8:27 PM IST

20:08 August 25

DALITHABANDHU: హుజూరాబాద్‌లో ఈనెల 27నుంచి పూర్తిస్థాయి సర్వే: రాహుల్‌ బొజ్జా

   కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత కుటుంబాల గణన చేపట్టనున్నట్లు సీఎంవో కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. ప్రాథమికంగా 21వేల కుటుంబాలు ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. 350 మంది అధికారులు ఈనెల 27వ తేదీ నుంచి ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని ఆయన తెలిపారు. అంతకు ముందు గణన చేపట్టనున్న అధికారులతో సమీక్ష నిర్వహించిన రాహుల్‌ బొజ్జా.. నియోజకవర్గంలోని అన్ని దళిత కుటుంబాలను దళిత బంధు పథకంలో చేరుస్తామని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి అధికారి రోజుకు 100నుంచి 150 ఇళ్లు పరిశీలించడమే కాకుండా వెంటనే దళిత బంధు ఖాతాలు కూడా ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటారని అన్నారు. అయితే గణనకు వెళ్లే సిబ్బంది లబ్దిదారుల ఎంపిక కోసం కాకుండా గణన కోసం వెళుతున్నట్లు శిక్షణ కూడా ఇచ్చామని అన్నారు.

    ఇప్పటికే 1500కోట్ల రూపాయలు ప్రభుత్వం కలెక్టర్ ఖాతాలో జమ చేసిందని కుటుంబాల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాగానే నిధులు వారి ఖాతాల్లోకి జమ చేస్తామని అన్నారు. గణన చేసే సందర్భంలోనే ఆ కుటుంబం ఎలాంటి యూనిట్‌ ఏర్పాటు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుందనే అంశాన్ని కూడా పరిశీలిస్తామని వివరించారు. ఖాతాల్లో నుంచి నగదు డ్రా చేసుకొనే విధంగా ఉండదని ఎక్కడెక్కడ ఖర్చు చేయాలో నిబంధనలు కూడా వివరిస్తామని రాహుల్‌ బొజ్జా వివరించారు.

ఇదీ చదవండి: cm kcr review: జలవివాదాలు, కేంద్రం గెజిట్‌పై సీఎం కేసీఆర్‌ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.