కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ తండా, నల్లని తండాల్లో నర్సరీలు, వైకుంఠధామం, అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ శశాంక సందర్శించారు. రాయికల్ తండాలో ఉన్న నర్సరీని పరిశీలించి మొక్కలకు రోజూ నీరు పోయాలని ఆదేశించారు. నల్లని తండాలో నిర్మిస్తున్న వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్, నిర్మాణం పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి ఎంతమంది పిల్లలు వస్తున్నారని వారికి సరైన పోషకాహారం అందిస్తున్నరా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాలలో 40 మంది పిల్లలకు ఎక్కువగా ఉంటే అదనంగా గదులు కేటాయించనున్నట్లు వివరించారు. అనంతరం తండావాసులు చేసిన జొన్న రొట్టెలను గ్రామస్థులతో కలిసి కలెక్టర్ తిన్నారు.
గ్రామస్థులు కలెక్టర్‌ను రాయికల్ తండాలో రేషన్ షాప్ ఏర్పాటు చేయవలసిందిగా కోరగా ప్రతిపాదనలు పంపాల్సిందిగా హుజూరాబాద్ ఆర్డీఓను ఆదేశించారు. మిషన్ భగీరథ నీరు నల్లని తండా గ్రామానికి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ ఈఈకి సూచించారు.
ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఆర్డీఓ, పంచాయతీ రాజ్ శాఖ ఈఈ శ్రీనివాస్, రాష్ట్ర ఎంపీడీవోల ఫోరం అధ్యక్షులు సైదాపూర్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, బర్మావత్ రామా, సర్పంచ్ అక్షయం, ఎంపీడీఓ పద్మావతి, ఎమ్మార్వో దానందం, స్వచ్ఛ భారత్ కో- ఆర్డినేటర్ కిషన్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: నగర పాలికల్లోనూ బస్తీ దవాఖానాలు: మంత్రి ఈటల