ETV Bharat / state

కరోనా వార్డులను పరిశీలించిన కలెక్టర్ శశాంక

ప్రైవేటు ఆసుపత్రుల బిల్లుల పర్యవేక్షణకు ఆర్డీఓ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పనిచేస్తోందని... ఫిర్యాదులు వస్తే ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. శుక్రవారం ఆయన కరోనా వార్డులను పరిశీలించారు.

author img

By

Published : May 22, 2021, 9:46 AM IST

collector shashanka visited corona wards
కరోనా వార్డులను పరిశీలించిన కలెక్టర్ శశాంక

కరీంనగర్​ జిల్లా కేంద్రంలోని కరోనా వార్డులను జిల్లా పాలనాధికారి శశాంక పరిశీలించారు. కరోనా చికిత్స అందించినప్పుడు వసూలు చేయాల్సిన ఛార్జీల గురించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిందని తెలిపారు. అధికంగా ఫీజులు వసూలు చేసినట్లయితే ఫిర్యాదు చేయాలని రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం వాట్సాప్‌ నంబర్‌ కేటాయించినట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఉన్న కంట్రోల్‌ రూంకు ఫిర్యాదు చేసినా.. వాటిని టాస్క్‌‌ఫోర్స్‌ కమిటీ ఆధ్వర్యంలో సమీక్షిస్తున్నట్లు చెప్పారు. కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ... దానికి అనుగుణంగానే జిల్లా ఆసుపత్రిలో పడకలు పెంచుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

ప్రస్తుతం ఆసుపత్రిలో 290 పడకలు ఉండగా... 218 మంది వైద్యం పొందుతున్నారని చెప్పారు. జిల్లా ఆసుపత్రిలో ఎన్ని పడకలు అందుబాటులో ఉన్నాయో స్పష్టంగా ఆసుపత్రి ముందు ప్రదర్శిస్తున్నామని కలెక్టర్ శశాంక అన్నారు. రెమ్​డిసి​విర్ ఇంజక్షన్ల ఒత్తిడి మే మొదటి వారంతో పోలిస్తే ప్రస్తుతం తగ్గిందని... లభ్యత కూడా పెరిగినట్లు చెప్పారు. ఇంజక్షన్లు బ్లాక్‌ మార్కెట్‌కు తరలించకుండా పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ నిరంతరం నిఘా పెట్టిందని చెప్పారు. ఆక్సిజన్ వినియోగంలోనూ ఎలాంటి లోటు లేకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేక అధికారుల బృందంతో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఫిల్లింగ్ కేంద్రాల్లో ప్రతిరోజు ఎన్ని సిలిండర్లు నింపుతున్నారు, ఎలా వినియోగిస్తున్నారో పూర్తిగా తెలుసుకుంటున్నామని జిల్లా పాలనాధికారి శశాంక అన్నారు.

ఇదీ చదవండి: అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.