ETV Bharat / state

ఈటీవీ భారత్​ కథనానికి సీఎం సతీమణి స్పందన.. పేద కుటుంబానికి ఆర్థిక సాయం - ఎమ్మెల్యే రవిశంకర్​ తాజా వార్తలు

కరీంనగర్ జిల్లాలో పేద కుటుంబం దుస్థితిపై ఈటీవీ భారత్​ కథనానికి సీఎం కేసీఆర్​ సతీమణి శోభ స్పందించారు. తన వంతుగా లక్ష రూపాయల సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆ పేద కుటుంబానికి ఇల్లు నిర్మిస్తామని స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ హామీ ఇచ్చారు.

cm kcr wife help to poor family in karimnagar district
పేద కుటుంబానికి సాయం చేసిన సీఎం సతీమణి శోభ
author img

By

Published : Nov 8, 2020, 3:19 PM IST

Updated : Nov 8, 2020, 4:11 PM IST

కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్‌కు చెందిన తిరుపతి అనారోగ్యంతో గత నెల 18న హఠాత్తుగా చనిపోయాడు. రెక్కల కష్టం మీద జీవనం సాగించే... ఆ కుటుంబానికి ఉండటానికి ఇల్లు లేదు. అద్దెకు కూడా ఇల్లు లభించకపోవడం వల్ల నిర్మాణంలో ఉన్న భవనంలో తలదాచుకుంటున్నారు. ప్రహరీ గోడ లేని భవనంలో వృద్ధులు, పిల్లలు చలికి వణికుతున్నారు. అప్పుచేసి ఇల్లు కడుతుండగా... తిరుపతి చనిపోవడంతో నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది.

వీరి ధీనగాథపై ఇంటి పెద్ద అకాల మరణం... చేసింది ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం, కన్నీళ్ల మంటతో చలికాచుకుంటున్న కుటుంబం... అర్థిస్తోంది దాతల సాయం కథనాలను ఈటీవీ భారత్ ప్రసారం చేసింది. ఈటీవీ భారత్ కథనాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ స్పందించారు. ఆ పేద కుటుంబానికి రూ.లక్ష సాయం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​, స్థానిక నేతలు మరో రూ.2 లక్షలు ప్రకటించారు. అంతేకాకుండా వారికి ఇల్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈటీవీ భారత్​ కథనానికి సీఎం సతీమణి స్పందన.. పేద కుటుంబానికి ఆర్థిక సాయం

ఇవీ చదవండి: ఇంటి పెద్ద అకాల మరణం... చేసింది ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం

కన్నీళ్ల మంటతో చలికాచుకుంటున్న కుటుంబం... అర్థిస్తోంది దాతల సాయం

Last Updated : Nov 8, 2020, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.