ETV Bharat / state

గాయత్రి పంప్​ హౌస్ సందర్శించిన శిక్షణా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు - కరీంనగర్​ జిల్లాలో శిక్షణ అధికారుల పర్యటన

కరీంనగర్ జిల్లా వెలిచాలలో ట్రైనీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సందడి చేశారు. లక్ష్మీపూర్​ గాయత్రి పంప్​ హౌస్​ను సందర్శించారు. గ్రామస్థాయి ప్రభుత్వ యంత్రాంగం పనితీరును ఐదుగురు శిక్షణ అధికారుల బృందం అధ్యయనం చేయనున్నారు.

civil services trainee officers visit kaleshwaram gayathri pump house
గాయత్రి పంప్​ హౌస్ సందర్శించిన శిక్షణా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు
author img

By

Published : Mar 3, 2020, 9:19 PM IST

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్​ను సివిల్​ సర్వీసెస్ శిక్షణా అధికారులు సందర్శించారు. గ్రామస్థాయి ప్రభుత్వ యంత్రాంగం పనితీరుపై అధ్యయనం చేసేందుకు ఐదుగురు శిక్షణా అధికారులు వెలిచాలకు వచ్చారు. ఈ సందర్భంగా గోదావరి జలాల ఎత్తిపోతకు ఉపయోగిస్తున్న బాహుబలి పంపుసెట్లను పరిశీలించారు. సర్జీపూల్, సొరంగ నిర్మాణ పనుల వివరాలు ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

గాయత్రి పంప్​ హౌస్ సందర్శించిన శిక్షణా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు

గ్రామాల్లో చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ శాఖల పనితీరును ఐదురోజుల పాటు అధ్యయనం చేయనున్నారు. ఓం కాంత్ ఠాకూర్, అర్జున్ ఉపాధ్యాయ, కంథాలే విజయ్ సాహెబ్ రావు, శ్రేయ్​వత్స్, ప్రేమ్ ప్రకాష్ బృందానికి మండల స్థాయి అధికారులు తమ శాఖల విధి నిర్వహణ వివరించారు.

ఇదీ చూడండి: స్టార్​ హోటల్​ సిబ్బంది 'నిర్బంధం'- కరోనానే కారణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.