ETV Bharat / state

'పదకొండో పీఆర్సీ అమలు చేయాల్సిందే' - కరీంనగర్​లో సీఐటీయూ ధర్నా

కరీంనగర్​ కలెక్టరేట్ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్మికులకు 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు అందజేయాలని డిమాండ్ చేశారు.

Citu protest
సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
author img

By

Published : Nov 29, 2019, 7:45 PM IST

మున్సిపల్‌ కార్మికులకు 11వ పీఆర్సీ అమలు చేయాలని కరీంనగర్ కలెక్టరేట్‌ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా.. కనీస వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. మున్సిపల్‌లో పనిచేస్తున్న కార్మికులందరికీ.. 11వ పీఆర్సీ కింద రూ. 24వేల వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పడిన కొత్తపల్లి, చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్‌ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలకు చెందిన పారిశుద్ధ్య కార్మికులకు జీఓ నంబర్ 14 ప్రకారం వేతనాలు రూ. 12వేలు, రూ. 15వేలు,రూ. 17,500లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చొప్పదండి మున్సిపల్ కార్మికులకు 16 నెలలుగా ప్రావిడెంట్ ఫండ్‌ సొమ్ము ఇవ్వకుండా కమిషనర్‌ నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సీఐటీయు నాయకులు డిమాండ్ చేశారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా

ఇదీ చూడండి: కార్మిక సంఘాల నేతలకు షాకిచ్చిన ఆర్టీసీ యాజమాన్యం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.