కరీంనగర్ నగరపాలక సంస్థ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 11వ పీఆర్సీలో మున్సిపాలిటీ కార్మికులకు రూ. 24 వేల కనీస వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని సీటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బండారు శేఖర్ విమర్శించారు.
తెలంగాణ వచ్చిన తర్వాత 10వ పీఆర్సీలో మున్సిపల్ కార్మికులకు ఒక్కపైసా కూడా పెంచకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రస్తుతమున్న నిత్యావసరల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు.
ఇదీ చదవండి: ఆధార్ వ్యథలు... చలిలోనే రేషన్దారుల అవస్థలు