సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభపై చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ తీవ్రంగా మండిపడ్డారు. అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇస్తే గౌరవంగా స్వీకరిస్తామని.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై, వారి కుటుంబ సభ్యులపై విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
ఎమ్మెల్యే హోదాను కల్పించి.. తన కూతురులా చూసిన వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పదవుల కోసం కేసీఆర్‌ను తండ్రి అన్న శోభ.. కేవలం రాజకీయ లబ్ధి కోసమే వారి కుటుంబంపై వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. విమర్శలు చేస్తే నియోజకవర్గ ప్రజలు తిరగబడతారని.. ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు.
ఇదీ చూడండి: సాగర్ ఉపఎన్నిక బరిలో 41మంది అభ్యర్థులు