రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించగా... ఆయన మాత్రం రూ.7 వేల కోట్లు ఇచ్చిందని ప్రచారం చేశారన్నారన్నారు. ఆయన చెప్పినట్లుగా రూ.7వేల కోట్లు నిజంగా రాష్ట్రానికి తీసుకొస్తే సన్మానం చేస్తామన్నారు.
రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలను త్వరగా చెల్లించే విధంగా కృషి చేయాలన్నారు. పార్లమెంటులో రాష్ట్ర సమస్యలపై మాట్లాడిన రికార్డులను వెల్లడించాలని సవాల్ చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న రైతు బీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదితర పథకాల అమలుపై ప్రధానమంత్రి స్వయంగా ప్రశంసించారని గుర్తు చేశారు. కరీంనగర్ నుంచి నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణంపై స్పందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఇక ముందు దుష్ప్రచారం చేస్తే తగిన విధంగా స్పందిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'అబద్ధాలు చెప్పి ప్రజలను భ్రమపెట్టేది భాజపా ఎంపీలే'