కొవిడ్ బాధితులకు సకాలంలో మందుల కిట్లు అందజేస్తూ... వారిలో వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం నింపాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆయన సందర్శించారు. కరోనా నియంత్రణకు ఇంటింటి సర్వేను సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. వైరస్ పట్ల భయాందోళనలతో ఆరోగ్యాన్ని క్లిష్టతరం చేసుకుంటున్నారని అన్నారు. వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ప్రభుత్వం ఇచ్చే కిట్లతో ఆరోగ్యం సత్వరమే కుదుటపడే అవకాశం ఉంటుందని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రతపై ప్రజల్లో అపోహలు తొలగించాలని సూచించారు. కరోనా ప్రభావం కన్నా భయంతో ఎక్కువ మంది మృతి చెందడం బాధాకరమన్నారు.
ఇదీ చదవండి: ఒకే మంచంపై మృతదేహం, బాధితుడు