ETV Bharat / state

Trs Complaints On Etela: ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈటలపై కేసులు - Huzurabad by elections

హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రధాన పార్టీల ప్రచారం తారస్థాయికి చేరింది. తాజాగా భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని (Trs Complaints On Etela) సీఈసీకి తెరాస ఫిర్యాదు చేసింది.

Trs Complaints On Etela
ఈటలపై కేసులు
author img

By

Published : Oct 12, 2021, 10:47 PM IST

హుజూరాబాద్ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్... ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని (Trs Complaints On Etela) కేంద్ర ఎన్నికల సంఘానికి తెరాస (Trs) నాలుగు ఫిర్యాదులు సమర్పించింది. రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ మరణించగా.. ఆ ఘటనతో ఎలాంటి సంబంధంలేని ఎమ్మెల్యే బాల్క సుమన్​ను తప్పుడు కేసులో ఇరికించేందుకు భాజపా, ఈటల రాజేందర్ ప్రయత్నించారని తెరాస ఆరోపించింది.

తెరాస విద్యార్థి విభాగం నాయకుడు జగన్​పై భాజపా నాయకులు హత్యాయత్నం చేశారని ఫిర్యాదుల్లో పేర్కొంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన హుజూరాబాద్​లో ఈటల రాజేందర్ రోడ్ షో (Etela Rajender Road show) నిర్వహించారని మరో ఫిర్యాదులో అధికార పార్టీ ఆరోపించింది. దసరా సందర్భంగా ఓటర్లకు తెరాస వేల రూపాయలు, మాంసం పంచుతోందని వాటిని తీసుకొని ఓటు మాత్రం తనకే వేయాలని ఈటల రాజేందర్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ఈ ఘటనలపై విచారణకు ఆదేశించి భాజపా, ఈటల రాజేందర్​పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులతో పాటు పలు వీడియోలను సమర్పించారు.

రసవత్తరంగా ప్రచారం...

హుజూరాబాద్ ఉపఎన్నికల (huzurabad by election) ప్రచారం రసవత్తంగా సాగుతోంది. ఈఎన్నిక.. మంత్రి హరీశ్​రావు, భాజపా అభ్యర్థి ఈటల మధ్య అన్నట్లు సాగుతోంది. దీనికి ప్రధాన పార్టీలు వినూత్నంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ... ప్రత్యర్థిని ఒంటరిని చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. ఈటల మాత్రం మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

హరీశ్​ సవాల్...

గ్యాస్ సిలిండర్ ధరలో రూ. 291 రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఉందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా (Harish Rao Challenge) చేస్తానని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. లేనిపక్షంలో హుజూరాబాద్ ఉపఎన్నిక పోటీ నుంచి తప్పుకోవాలని భాజపా అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్​కు హరీశ్​రావు సవాల్ (Harish Rao Challenge) విసిరారు.

భాజపా ఫిర్యాదు..

హుజూరాబాద్​ ఉపఎన్నిక(Huzurabad By Election 2021) నిష్పక్షపాతంగా నిర్వహించాలంటే ప్రస్తుతం ఉన్న జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, రిటర్నింగ్ అధికారులను బదిలీ చేయాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి.. రాష్ట్ర ఎన్నికల అధికారి(Telangana Election Officer)కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, హుజూరాబాద్ నియోజకవర్గ(Huzurabad By Election 2021) ఇంఛార్జ్, రిటర్నింగ్ ఆఫీసర్ వంటి అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత అధికార పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు సూచనల మేరకు వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: Huzurabad: వాడివేడిగా ఉపఎన్నిక ప్రచారం.. కొనసాగుతున్న విమర్శల పర్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.