ETV Bharat / state

తహసీల్దార్​ను దూషించిన నాయకునిపై కేసు - Ramadugu Tahasildar Case

తహసీల్దార్​ను దూషించి... విధులకు ఆటంకం కలిగించారన్న కారణంతో కరీంనగర్​ జిల్లా గంగాధర్​ మండలం సింగిల్​ విండో మాజీ ఛైర్మన్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను స్టేషన్​కు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన మద్దతుదారులు ఆందోళన చేశారు.

గంగాధర కేసు
గంగాధర కేసు
author img

By

Published : May 9, 2020, 5:25 PM IST

కరీంనగర్ జిల్లా రామడుగు మండల తహసీల్దార్ కోమల్ రెడ్డిని దూషించి, విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుపై గంగాధర సింగిల్​ విండో మాజీ ఛైర్మన్ కొత్త జైపాల్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలోని రామడుగు, గంగాధర మండలాల సరిహద్దులోని దీపాలకుంట విస్తీర్ణంపై ఉన్న సందిగ్ధాన్ని తొలగించేందుకు రెండు మండలాల తహసీల్దార్లు కోమల్ రెడ్డి, జయంత్​లు సర్వే చేపట్టారు.

ఈ తరుణంలో కొత్త జయపాల్ రెడ్డి తమను బెదిరించి, విధులకు ఆటంకం కలిగించారని తహసీల్దార్ కోమల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కోసం జయపాల్​ రెడ్డిని గంగాధర పీఎస్​కు తరలించేందుకు యత్నించారు. ఈ సమయంలో ఆయన మద్దతుదారులు ఆందోళన చేయడం వల్ల కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఘటనపై విచారణ జరిపిన సీఐ రమేశ్​ ఆయనకు స్టేషన్ బెయిల్ మంజూరు చేసినట్లు తెలిపారు.

ఇదీ చూడండి : మాస్క్​ల బజార్​ చూసొద్దామా...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.