కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ రాజీవ్ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ వైపు నుంచి హైదరాబాద్ వైపు అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
మృతి చెందిన వారిలో ఒకరు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన వేముల ప్రణయ్ కుమార్, వివేక్ చంద్రగా పోలీసులు గుర్తించారు. అంకరి స్వరాజ్, శివకేశవ్లు గాయపడ్డారు. వీళ్లంతా విద్యార్థులని.. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.