హైదరాబాద్ నుంచి మెట్‌పల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో 23 మంది గాయపడ్డారు. నిన్న రాత్రి 10 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బయలు దేరిన బస్సు సుమారు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. 3 గంటల వరకు ఎన్నిసార్లు 108 సిబ్బంది, పోలీస్ సిబ్బందికి ఫోన్‌చేసినా స్పందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. చివరికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినా.. ఇక్కడ సిబ్బంది సైతం పట్టించుకోవడం లేదని వాపోయారు. గాయపడ్డవారిలో కొంతమందికి కాళ్లు విరిగాయి. ఒ మహిళ కంటికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇవీ చూడండి: పోలీస్ వాహనం ఢీ కొని గాయపడిన చిన్నారి ప్రణతి మృతి