కరీంనగర్ జిల్లా వీణవంకలో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉంటున్న రమ్యకు అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్‌తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా ఇంట్లో కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఉదయం కూడా ఇంట్లో గొడవ జరగటంతో రమ్య మనస్తాపానికి గురైంది. కూతురు శ్రీనితను తీసుకొని గ్రామశివారులో ఉన్న వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
అటుగా వెళ్తున్న స్థానికులు బావిలో మృతదేహాలను చూసి... పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఎస్సై కిరణ్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లికూతుళ్ల ఆత్మహత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.