కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలో వేయేళ్ల చరిత్ర కలిగిన బొమ్మలమ్మగుట్టపై జైనమత చక్రేశ్వరీమాత ఆలయం ఉంది. క్రీ.శ.945లో వేములవాడ చాళుక్యుల జినవల్లభుడు ఈ గుట్టపై శాసనాన్ని వేయించాడు. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించడంలో ఇక్కడి కందపద్యం కీలకంగా నిలిచింది.
అంతటి విశిష్టత కలిగిన ఈ గుట్టపై ఉన్న చక్రేశ్వరీ మాతను దర్శించేందుకు వెళ్లాలంటే మాత్రం సరైన దారిలేదు. పెద్దపెద్ద బండరాళ్లతో ఉన్న దారి నుంచి వెళ్లడానికి పర్యటకులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం గమనించిన జిల్లా కలెక్టర్ శశాంక.. సందర్శకులకు సౌకర్యంగా ఉండేందుకు మెట్ల దారి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
బొమ్మలమ్మగుట్టకు మెట్ల దారి ఏర్పాటు చేయాలని కోరగా.. పర్యటక శాఖ ఆ దిశగా చర్యలు చేపట్టింది. దారితో పాటు ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. ఆ పరిసరాల్లో ఆహ్లాదాన్ని పెంచేందుకు పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. బొమ్మలమ్మగుట్టకు గత వైభవం తీసుకువచ్చి, పర్యటక కేంద్రంగా మార్చేందుకు అధికారులు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
- ఇదీ చూడండి : 'ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించా'