కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో వికాస తరంగణి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా పాలనాధికారి శశాంకతో కలిసి మంత్రి ఈటల ప్రారంభించారు. పలువురు యువకులు రక్తదానం చేశారు.
తనుగుల, చెల్పూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ధాన్యం తూకాలను పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. ధాన్యం దిగుమతుల్లో పలువురు మిల్లర్లు తాలు పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై జిల్లా పాలనాధికారి శశాంకతో మంత్రి మాట్లాడారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని మిల్లర్లపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: 'ఆ కరోనా రోగికి ప్లాస్మా థెరపీ విజయవంతం!'