Bandi Sanjay Comments on CM KCR : కరీంనగర్ జిల్లా చొప్పదండిలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకే భాజపా కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. ఈ ఘటనలను ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని కేసీఆర్ గ్రహించాలని అన్నారు. ఖమ్మంలో భాజపా కార్యకర్త నాగేశ్వరరావు పట్ల దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఆర్మూర్‌లో ఎంపీ అర్వింద్‌పై దాడి చేయించారని విమర్శించారు.
Bandi Sanjay Fires on CM KCR : ముఖ్యమంత్రి కేసీఆర్ అభద్రతాభావానికి లోనవుతున్నారనడానికి ఈ దాడులే నిదర్శనమని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రలను పక్కన పెట్టి.. కొంత మంది పోలీసులు.. ముఖ్యమంత్రికి కొమ్ములు కాస్తున్నారని విమర్శించారు.
Bandi Sanjay Visit in Choppadandi :
'కేసీఆర్ డైరెక్షన్లోనే భాజపా నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. అక్రమంగా మా వాళ్లపై కేసులు పెడుతున్నారు. కొందరు పోలీసులు కేసీఆర్‌కు కొమ్ము కాస్తున్నారు. నేను పోలీసులకు మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై దృష్టి పెట్టండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా.. కేసీఆర్‌ను విమర్శించినా జైలుకు పంపిస్తామని బెదిరించడం సరికాదు. తెలంగాణ ఉద్యమ నేతలంతా భాజపాలోకి వస్తున్నారు. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ సాధించుకున్నామో.. కేసీఆర్ ఆ లక్ష్యాన్ని పక్కనపెట్టారు. అందుకే ఉద్యమ నాయకులంతా భాజపాలో చేరుతున్నారు.'
- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
- ఇదీ చదవండి : కవితను ఓడించినందుకే ఎంపీ అర్వింద్‌పై దాడులు: భాజపా
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!