కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో పాడైపోయిన రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో భాజపా కార్యకర్తలు నిరసన చేపట్టారు. కరీంనగర్ నుంచి చొప్పదండికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమై ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భాజపా ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి రాకేష్ ఆరోపించారు. నగరంలోని అపోలో ఆసుపత్రి ఎదురుగా మోకాళ్లలోతు గుంతలు ఏర్పడి ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. గతంలో ఇదే రహదారిలో వెళ్లిన ఓ ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి పడిపోయి మృత్యువాత పడ్డాడు. ఓవైపు పాలకులు, మరోవైపు అధికారులు నగర అభివృద్ధిపై పట్టనట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.
ఇదీ చూడండి : 'సర్వే చేయండి... ఆగం చేయకండి'