రాష్ట్ర బంద్‌లో భాగంగా కరీంనగర్ బస్టాండ్ వద్ద భాజపా అధికార ప్రతినిధి బండి సంజయ్ ధర్నా నిర్వహించడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇంటర్మీడియట్ విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని... వెంటనే గ్లోబరీనా సంస్థపై చర్య తీసుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బస్టాండ్ నుంచి బస్సులు బయటికి వెళ్లకుండా ధర్నా చేపట్టడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులకు, భాజపా నాయకులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ప్రభుత్వం వెంటనే అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా... ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కోరారు. స్పందించకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.
ఇవీ చూడండి: నిజాం కళాశాల వద్ద ఏబీవీపీ ఆందోళన... నేతల అరెస్ట్