కరీంనగర్లోని శ్రీమహాశక్తి ఆలయంలో దేవిశరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. చివరిరోజు మహిళలు ఆనందోత్సాహాలతో దాండియా ఆడారు. సద్దుల బతుకమ్మ వేడుకను ఘనంగా నిర్వహించారు.
చెడుపై సాధించిన విజయానికి చిహ్నాంగా దసరా పండుగను జరుపుకుంటామని ఆయన తెలిపారు. ప్రజలందరికీ శుభం కలగాలని బండి సంజయ్ ఆకాంక్షించారు. నవరాత్రి ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించారని, అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.