ETV Bharat / state

ETELA RAJENDER : 'ఆ అహంకారంతోనే.. మైనార్టీబంధు ఇవ్వడం లేదు'

ముస్లింల ఓట్లు తెరాసకు తప్ప ఎవరికీ పడవనే అహంకారంతోనే వారిని ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana Chief Minister KCR) పట్టించుకోవడం లేదని భాజపా నేత ఈటల రాజేందర్(Bjp Candidate Etela Rajender) విమర్శించారు. ఎస్సీలకు దళితబంధు(Dalit Bandhu)లాగే.. ముస్లింలకు మైనార్టీబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ETELA RAJENDER
ETELA RAJENDER
author img

By

Published : Oct 8, 2021, 9:31 AM IST

ఆ అహంకారంతోనే.. ముస్లింబంధు ఇవ్వడం లేదు

ఎస్సీలకు దళితబంధు ఇచ్చినట్లుగా ముస్లింలకు మైనార్టీ బంధు ఇవ్వాలని భాజపా నేత ఈటల రాజేందర్(Bjp Candidate Etela Rajender) డిమాండ్ చేశారు. అన్ని కులాల్లోనూ పేదలు ఉన్నారని.. పేదలను కులమతాలుగా విభజించలేమని అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మింకుటలో నిర్వహించిన దళిత మోర్చా సమ్మేళనంతో పాటు ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.

మైనార్టీల్లో పేదవాళ్లున్నా.. అలాంటి మంచి పని ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana Chief Minister KCR) చేయరని ఈటల(Bjp Candidate Etela Rajender) విమర్శించారు. వారు తెరాసకు తప్ప ఎవరికి ఓటు వేయరన్న అహంకారంతో ఆ పనిచేయరని ఆరోపించారు. ధనిక రాష్ట్రమని పదేపదే చెప్పే ముఖ్యమంత్రి పేదలకు ఎందుకు సాయం చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అయిదు నెలలుగా తెరాస మంత్రులు, నాయకులు గొర్రెల మందపై తోడేళ్లు పడ్డట్లుగా హుజూరాబాద్​(Huzurabad by election 2021)లో తిష్ట వేశారని ఎద్దేవా చేశారు. ఈసారి ఎన్నికల్లో కందుగుల గ్రామం నుంచి ఒక్క ఓటు కూడా తెరాసకు పడొద్దని ఈటల ఓటర్లను అభ్యర్థించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.