బిగ్‌బాస్-3లో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న రాహుల్ సిప్లిగంజ్ తన వ్యాపారాన్ని కరీంనగర్ నుంచి మొదలుపెట్టారు. ఊకో..కాకా పేరుతో రెడీమేడ్ బట్టల దుకాణాన్ని ఆయన తన స్నేహితునితో కలిసి ప్రారంభించారు. కరోనా కారణంగా వ్యాపారం కాస్తా ఆలస్యమైందని ఆయన పేర్కొన్నారు. బిగ్‌బాస్‌లో ప్రజలు తనను ఎంతో ఆదరించారని... బిగ్‌బాస్ నుంచి బయటికి రాగానే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలని భావించినట్లు తెలిపారు.
కరీంనగర్ నుంచి వ్యాపారం ప్రారంభిస్తే కలిసి వస్తుందన్న ఉద్దేశ్యంతో ఇక్కడ షోరూం మొదలు పెట్టానన్న రాహుల్... త్వరలో మరో ఏడు చోట్ల షో రూంలు ప్రారంభిస్తామన్నారు. మన్నికైన వస్త్రాలను తక్కువ ధరలకే అందించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా తనకు ఇష్టమైన పాటను పాడి అలరించారు.
ఇదీ చదవండి: హైదరాబాద్ శివార్లలో జోరుగా కోడి పందేలకు ఏర్పాట్లు