దేశవ్యాప్తంగా 15 వేల 666 పోలీస్ స్టేషన్లలో బెజ్జంకి స్టేషన్ 41వ స్థానంలో నిలవడం అభినందనీయమని సిద్దిపేట కమిషనర్ జోయల్ డేవిస్ అన్నారు. బెజ్జంకి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు సిబ్బందితో సమావేశమయ్యారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే సంస్థ... స్త్రీల రక్షణ, క్రైమ్ రేట్ పరిగణలోకి తీసుకుని 41వ ర్యాంకును ఇచ్చిందని తెలిపారు. మిగతా స్టేషన్లు బెజ్జంకి స్టేషన్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి : అంగన్వాడీలో సబ్ కలెక్టర్ కుమార్తె