కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డు వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన యాచకుడు మృతి చెందాడు. 15 రోజుల క్రితం కరీంనగర్‌కి వచ్చినట్లు తోటి యాచకులు తెలిపారు. సోమవారం ఉదయం రోడ్డుపై పడి పోయి ఉండగా స్థానిక దుకాణ యజమానులు చూశారు.
మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తర్వాత పోలీసులకు, మున్సిపల్ శాఖకు సమాచారం అందించారు. అయినప్పటికీ పోలీస్ అధికారులు గానీ, మున్సిపల్ అధికారులు గానీ మాకెందుకులే అన్నట్టు వ్యవహరించారు. చివరగా మధ్యాహ్నం ఒంటిగంటకు మున్సిపల్ సిబ్బంది యాచకుడి శవాన్ని ట్రాక్టర్లో వేసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిరునామా తెలిసినంతవరకు కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నేను మార్చిలో భద్ర పరుస్తామని మున్సిపల్ సిబ్బంది తెలిపారు.
- ఇదీ చూడండి: రాజధానిలో నాలాల విస్తరణ.. సవాళ్లే అడుగడుగున!