కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు రెండు ఎలుగుబంట్లు పడ్డాయి. సోమవారం తెల్లవారుజామున అరుపులు రావడం గమనించిన గ్రామస్థులు బావిలో చూసేసరికి భల్లూకాలు కనిపించాయి. వెంటనే స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా మత్తు ఇంజక్షన్ ఇచ్చి వలల సహాయంతో పైకి తీశారు. ఎలుగుబంట్లతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కనే ఉన్న గుట్టల చుట్టూ కంచె ఏర్పాటు చేస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:మనీ యాప్ల ఆగడాలకు పాడాలి... చరమగీతం