ETV Bharat / state

BEAR WANDERING: శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎలుగుబంటి కలకలం.. - శాతవాహన విశ్వవిద్యాలయం తాజా వార్తలు

BEAR WANDERING: శాతవాహన విశ్వవిద్యాలయం విద్యార్దులను ఎలుగుబంటి మరోసారి కలవరపెడుతోంది. మూడు నెలల తర్వాత వర్సిటీ ఆవరణలోకి రావడం విద్యార్దుల్లో ఆందోళన మొదలైంది. గతంలో రాత్రి వేళల్లో భల్లూకం సంచరిస్తున్నట్లు ఓ విద్యార్థి వీడియో చిత్రీకరించాడు. అటవీ శాఖ అధికారులప వారంపాటు బోన్లు ఏర్పాటు చేసి ఎలుగుబంటిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. అయితే ఆచూకీ లభించకపోవడంతో.. వెళ్లిపోయిందని ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మరోసారి అలికిడి అవ్వడంతో పట్టుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

శాతవాహన విశ్వవిద్యాలయం
శాతవాహన విశ్వవిద్యాలయం
author img

By

Published : Jul 8, 2022, 3:19 PM IST

BEAR WANDERING: కరీంనగర్ జిల్లా శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎలుగుబంటి సంచారం మరోసారి కలకలం సృష్టించింది. దాదాపు 200ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రాంగణంలో పూలకుండీలు చిందరవందర చేయడంతో భల్లూకం మళ్లీ వచ్చిందనే అభిప్రాయానికి వచ్చారు. తగిన జాగ్రత్తలు తీసుకొంటూనే దాన్ని పట్టుకొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విషయం తెలిసిన వెంటనే విశ్వవిద్యాలయానికి వచ్చిన అటవీ శాఖ అధికారులు.. ఎలుగుబంటి జాడ కోసం జల్లెడ పడుతున్నారు.

ఇక్కడ చిట్టడవిలో ఉన్న రెండు కుంటల వద్దకు ఎలుగు బంట్లు నీటి కోసం వస్తుంటాయని అంచనా వేశారు. దీంతో ప్రాంగణంలో ఎలుగు ఏయే ప్రాంతాల్లో సంచరించే అవకాశం ఉందో ఆయా ప్రాంతాల్లో కెమెరాలతోపాటు బోన్లు ఏర్పాటు చేశారు. మూడు నెలలుగా వర్సిటీ ప్రాంతంలోనే సంచరిస్తున్న దృష్ట్యా.. ఇప్పటివరకు ఎవరికి ఎలాంటి అపాయం తలపెట్టలేదని.. అయినా జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులను కోరినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

కరీంనగర్ చుట్టుపక్కల విస్తారమైన అడవులు, భారీ గుట్టలు ఉండేవి. భూముల ధరలు పెరగడం, నగరం విస్తరిస్తుండటంతో కొండలు, గుట్టలతోపాటు చెట్లు కూడా మాయమవుతున్నాయి. ఫలితంగా అడవుల్లో సంచరించే జంతువులు ఆహారం, నీటి కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి. గతంలో బీఎస్​ఎన్​ఎల్, పోలీస్ కమిషనర్ కార్యాలయాల్లోనూ భల్లూకాలు దూరి గందరగోళం సృష్టించాయి. ప్రస్తుతం పోటీ పరీక్షలు ఉన్న దృష్ట్యా విద్యార్దులు చదువుకొనేందుకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో సెలవులు ప్రకటించడం లేదని అధికారులు తెలిపారు. కెమెరాల్లో నమోదు అయ్యే అంశాలను బట్టి ఎప్పటికప్పుడు తగు నిర్ణయం తీసుకుంటామని వారు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: పెండింగ్​ హామీలపై దృష్టి సారించిన సర్కారు..

రాజ్యసభ కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం.. వెంకయ్య కీలక సూచనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.