ETV Bharat / state

గంగుల సవాల్... కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణకు 'ఈటల' సిద్ధమా? - బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్​ వార్తలు

ఈటలతో రాజకీయ వైరమే తప్ప వ్యక్తిగత కక్ష లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్​ అన్నారు. ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణకు సిద్ధమని ప్రకటించారు.

gangula kamalakar
గంగుల కమలాకర్​
author img

By

Published : Jul 20, 2021, 12:30 PM IST

Updated : Jul 20, 2021, 1:03 PM IST

ఈటలకు ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్​ కరీంనగర్​లో అన్నారు. ఈటల నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈటలతో రాజకీయ వైరమే తప్ప వ్యక్తిగత కక్ష లేదని చెప్పారు. మాజీ మావోయిస్టు ఏ మంత్రి పేరు చెప్పాడో ఈటల బయటపెట్టాలని డిమాండ్​ చేశారు. విచారణలో తన పేరు ఉంటే మంత్రిపదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయన్నారు. ఈటలకు ఎలాంటి భయాలు అవసరం లేదని చెప్పారు.

ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణకు సిద్ధమన్నారు. ఈటల సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నట్లు చెప్పారు. సానుభూతి కోసం ఈటల నాటకాలు ఆడుతున్నట్లు ఉందని విమర్శించారు. ఈటల తన మీద తానే దాడి చేయించుకునే అవకాశం ఉందన్నారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని మంత్రి గంగుల తెలిపారు.

శాంతిభద్రతల్లో తెలంగాణ ముందుందని అందరు చెబుతున్నారు. నిన్న మా మాజీ మంత్రి ఈటల రాజేందర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంచనలమైన వార్త పత్రికల్లో ప్రచురితమైంది. దీన్ని ఈటల రాజేందర్​ స్పందించలేదు. తెలంగాణ రాజకీయ హత్యలు, భౌతిక దాడులు ఉండవు, ఎవరో మాజీ మావోయిస్టు చెప్పారని ఈటల చెప్పారు. నా ప్రాణం అడ్డు పెట్టి ఈటలను రక్షణగా నిలుస్తా.

గంగుల కమలాకర్​, బీసీ సంక్షేమ శాఖ మంత్రి

ఈటల ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి: గంగుల

ఇదీ చదవండి: Koushik Reddy: 'ఈటలది స్వార్థ రాజకీయం... నాది సంక్షేమ మార్గం'

Last Updated : Jul 20, 2021, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.