Bandi Sanjay gets emotional: కరీంనగర్‌లో నిర్వహించిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కన్నీటి పర్యాంతమయ్యారు. సభకు హాజరైన ప్రజలను చూసి... ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. అనంతరం సభలో మాట్లాడుతూ... కరీంనగర్ గడ్డ బీజేపీ అడ్డా అని వ్యాఖ్యానించారు. హిందూధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తానని హామీనిచ్చారు. ధర్మం కోసం యుద్ధం చేస్తానని వెల్లడించారు. అవమానాలకు భయపడే వ్యక్తి కాదు ఈ బండి సంజయ్ అని పేర్కొన్నారు. కార్యకర్తలు, ప్రజలు కష్టార్జితం వల్ల ఎంపీగా గెలిచానని తెలిపారు.
నాకు డిపాజిట్ కూడా దక్కదని అన్నారు. నా గెలుపుతో దేశం ఆశ్చర్యపోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షడిగా నియమానికి కారణం కరీంనగర్ కార్యకర్తలే. ప్రజలే అభిమానంతో గెలిపించారని మోదీ, అమిత్‌షా గుర్తించారు. కాషాయ జెండాతో రాష్ట్రాన్ని పవిత్రం చేయాలని భాజపా అధిష్ఠానం చెప్పింది. - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణ పేరుందని టీఆర్‌ఎస్‌కు 2 సార్లు ఓట్లు వేశామని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ పేరుతో తెలంగాణ పదాన్ని తొలగించారన్నారు. టీఆర్‌ఎస్‌కు తెలంగాణతో సంబంధం లేదని వెల్లడించారు. తెలంగాణ తల్లికి కేసీఆర్ ద్రోహం చేశారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పేరుతో కేసీఆర్ తెలంగాణకు మోసం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. మద్యం పేరుతో దోచుకున్నారు, భూములు లాక్కున్నారని ఆరోపించారు.
బలిదానాలతో తెలంగాణ సాధించుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలకు సాయం చేస్తామని మోదీ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ సహరించడం లేదు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల ఏకమయ్యారు. దోచుకుందాం...కమీషన్లు దాచుకుందామని అనుకున్నారు. దోచుకుందాం...కమీషన్లు దాచుకుందామని అనుకున్నారు. - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చూడండి: