ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోలు చేయదని రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay in huzurabad press meet) మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎఫ్‌సీఐతో జరిగిన ఒప్పందాన్ని ప్రస్తావించారు. యాసంగిలో 90 లక్షల మెట్రిక్ టన్నులు, వానాకాలంలో 60 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందని సంజయ్(Bandi Sanjay in huzurabad press meet) వివరించారు. అదనంగా ధాన్యం దిగుబడులు వచ్చినా కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తామని చెప్పారు. హుజూరాబాద్(huzurabad by poll) లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్‌పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
ఈసీపై విమర్శలు సరికాదు
వరి వేస్తే ఉరే అన్న తెరాసకు గుణపాఠం చెప్పాలని హుజురాబాద్ ప్రజలకు బండి సంజయ్(Bandi Sanjay in huzurabad press meet) పిలుపునిచ్చారు. రాజ్యాంగ బద్ధంగా నడిచే ఎన్నికల సంఘాన్ని కించపరిచే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడటం(Bandi Sanjay in huzurabad press meet) సరికాదని హితవు పలికారు. పెట్రోలుపై రాష్ట్ర ప్రభుత్వం రూ. 41 పన్ను వసూలు చేస్తూ కేంద్రంపై నిందలు మోపుతోందని ఆరోపించారు. పెట్రోల్‌ను జీఎస్టీలో చేర్చాలని రాష్ట్రం ఎందుకు లేఖ రాయడం లేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఓటుకు రూ. 20 వేలు పంచుతూ.. అందులోనూ తెరాస కార్యకర్తలు రూ. 15 వేలు నొక్కేస్తున్నారని సంజయ్ విమర్శించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఉదయం 2 గంటల పాటు ప్రతి ఓటరుకు రూ. 20వేలు పంచారు. అందులోనూ మళ్లీ రూ. 15 వేలు నొక్కేసి రూ. 5వేలే పంచారు. మా కార్యకర్తలకు.. పంచే డబ్బులను అడ్డుకోవద్దని చెప్పాం. అవన్నీ మన డబ్బులే కాబట్టి పేదలకు అందాలని చూశాం. తెరాస డబ్బును నమ్ముకుంది. కానీ ప్రజలంతా భాజపా సామర్థ్యాన్ని నమ్ముకుని ఓటేస్తారు. హుజూరాబాద్ ప్రజలకు వరి కావాలా..? ఉరి కావాలా?. అన్నపూర్ణ రాష్ట్రమని తెలంగాణకు పేరుంది. వరి వేయొద్దని చెప్పే అధికారులపై చట్టపరంగా, న్యాయపరంగా పోరాటం చేస్తాం. వరి కావాలంటే భాజపాను గెలిపించండి.. ఉరి కావాలంటే తెరాసను గెలిపించండి. రైతుల పాలిట కేసీఆర్ తాలిబాన్లాగా మారాడు. -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
దళితబంధు నిలిపివేతపై తప్పుడు ప్రచారం
కొందరు కలెక్టర్ల ప్రవర్తన వల్ల అందరికీ చెడ్డ పేరొస్తుందని సంజయ్(Bandi Sanjay in huzurabad press meet) విమర్శించారు. వరి వేయొద్దని రైతులను, విత్తన షాపులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. దళిత బంధు విషయంలో కేసీఆర్.. ఆయన తీసుకున్న గోతిలో ఆయనే పడ్డారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. దళిత బంధు ఆపింది తామే అని హరీశ్ రావు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదని.. అందుకే ఆయన ఇక్కడ ప్రచారానికి రాలేదని(Bandi Sanjay in huzurabad press meet) వ్యాఖ్యానించారు. తెరాస ఎన్ని కుట్రలు చేసినా ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుస్తారని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: Huzurabad by elections 2021: హుజూరాబాద్‌లో కవర్ల కలకలం.. ఓపెన్ చేస్తే డబ్బులే డబ్బులు..!