Bandi Sanjay Comments On BRS : బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం యువతను మత్తుపదార్థాలకు బానిసలుగా మారుస్తోందని.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డీఎన్ఏల్లో బీసీ వ్యతిరేకత ఉందని విమర్శించారు. కరీంనగర్ పట్టణంలోని స్థానిక కాపువాడలో పాదయాత్ర చేపట్టిన ఆయన.. బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ, దళిత వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే దమ్ముందా.. అని ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబ ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం : బండి సంజయ్
Telangana Assembly Elections 2023 : రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని.. అలాగే కరీంనగర్లో బీఆర్ఎస్ నేతపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని అన్నారు. మంత్రి గంగుల కమలాకర్ చర్యల వల్ల ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని.. గంగుల ఓడిపోతాడని వాళ్ల పార్టీ అధ్యక్షుడే ఆయన బీఫారం ఇవ్వడానికి వెనుకాడారని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి విముక్తి పొందాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు.
Bandi Sanjay Fires on KCR : సీఎం కేసీఆర్(CM KCR) కాంగ్రెస్ అభ్యర్థులకు ఫండింగ్ చేస్తున్నారని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే బీఆర్ఎస్కు అమ్ముడుపోతారని బండి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవకపోయినా ఫర్వాలేదు కానీ.. బీజేపీ మాత్రం గెలవకూడదనే వ్యూహంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్పై నెలకొన్న ప్రజా వ్యతిరేకత ఓటును చీల్చేందుకు.. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
"బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డీఎన్ఏల్లో బీసీ వ్యతిరేకత ఉంది. రాష్ట్రానికి బీసీ, దళితవర్గ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించే దమ్ము బీఆర్ఎస్కు ఉందా.? బీఆర్ఎస్ ప్రభుత్వం యువతను మత్తుపదార్థాలకు బానిసలుగా మారుస్తోంది. గంగుల ఓడిపోతాడని వాళ్ళ పార్టీ అధ్యక్షుడే ఆయన బీఫా రం ఇవ్వడానికి వెనుకాడారు". - బండి సంజయ్, ఎంపీ
రాష్ట్రంలో వచ్చిన ఉప ఎన్నికల్లో ఎలాగైతే బీజేపీ అభ్యర్థులను గెలిపించారో.. అదే తరహాలో ఈ శాసనసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని బండి సంజయ్ కోరారు. కరీంనగర్ నగర అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ దాని ప్రస్తావన లేకుండా.. ఎంతసేపు ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడకుండా.. బీఆర్ఎస్ రాజకీయ లబ్ది పొందేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనుల్లో కమీషన్లకు కక్కుర్తి పడటంతో నాణ్యత లోపించిందని.. కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి ప్రారంభించిన కొద్ది రోజులకే పనికి రాకుండా పోయిందని మండిపడ్డారు.
Bandi Sanjay Fires on BRS : ఒక వర్గానికే కొమ్ము కాస్తే ఊరుకునే ప్రసక్తే లేదు : బండి సంజయ్