ఉద్యమనేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను భాజపా అధ్యక్షుడు బండిసంజయ్ సంబోధించే తీరుపై ప్రభుత్వ విప్ బాల్కసుమన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. భారతీయ సంస్కృతి గురించి గొప్పగా చెప్పే బండి సంజయ్.. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తిని 'పాస్‌పోర్ట్ బ్రోకర్'గా సంబోధించడం ఎంత వరకు సమంజసమని సుమన్ ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న వ్యక్తులను పట్టుకొని తాము కూడా మాట్లాడగలమని అన్నారు. ఇప్పటికైనా మాట్లాడే తీరును మార్చుకుంటే మంచిదని హితవు పలికారు.
కరీంనగర్ నుంచి ఎన్నికైన ఎంపీ బండి సంజయ్.. అభివృద్ధి గురించి తప్ప అన్నీ మాట్లాడుతున్నారని సుమన్ ఎద్దేవా చేశారు. నిజామాబాద్ నుంచి ఎంపికైన ఎంపీ అర్వింద్.. పసుపుబోర్డు తీసుకొస్తానని బాండ్లు రాసిచ్చి ఆ విషయం తప్ప అన్నీ మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి: 'కేసీఆర్ తప్పుడు నిర్ణయాలతోనే ప్రజల అవస్థలు'