శాసనసభ ఎన్నికల ఫలితాలే రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ వస్తాయని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనుల నిమిత్తం టెండర్లు ఆహ్వానించినా పనులు పూర్తి కాలేదన్నారు. ప్రస్తుతం పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టిసారించామని తెలిపారు. గత అయిదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసిన ప్రజలు తెరాస సభ్యత్వం తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు.
ఇవీ చూడండి: పుర ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం