ETV Bharat / state

అంబులెన్సును సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​

కరీంనగర్​ జిల్లా సైదాపురం మండలం కోసం నూతనంగా ఏర్పాటు చేసిన అంబులెన్సును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​ తెలిపారు. రిబ్బన్​ కట్​ చేసి అంబులెన్సును ప్రారంభించారు.

ambulance opening by mla satish kumar at saidapuram in karimnagar district
అంబులెన్సును సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​
author img

By

Published : Nov 9, 2020, 3:54 PM IST

కరీంనగర్ జిల్లా సైదాపురం మండల కేంద్రంలో నూతన అంబులెన్స్​ను హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​ రిబ్బన్ కట్​చేసి జెండా ఊపి ప్రారంభించారు. మండలంలో 27 గ్రామపంచాయతీలు ఉన్నాయని, ఇదివరకు అంబులెన్స్ రావాలంటే చిగురుమామిడి లేదా హుజురాబాద్ నుంచి వచ్చేదని, అందువల్ల ఆపదలో ఉన్నవారు కాలయాపనతో ఇబ్బందులకు గురయ్యేవారన్నారు.

ఇప్పుడు సైదాపూర్ మండలానికి ప్రత్యేక అంబులెన్స్ రావడం సంతోషకరమని, దీనికై కృషి చేసిన ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండల ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, సింగిల్ విండో ఛైర్మన్లు కొత్త తిరుపతి రెడ్డి, బిల్లా వెంకట రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి తీవ్ర అస్వస్థత.. బాలిక మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.