నీ బుల్లెట్ బండి ఎక్కి వచ్చేత్తపా.. డుగ్గు డుగ్గు డుగ్గుమని అంటూ ఓ నవ వధువు పాడిన పాట రాష్ట్రవ్యాప్తంగా ఉర్రూతలూగించింది. ప్రస్తుతం ఏ శుభకార్యం జరిగినా ఆ పాట తప్పనిసరి అయిపోయింది. తాజాగా బుల్లెట్ బండి పాటకు(Bullet bandi song) కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ దంపతులు(Additional collector couples) స్టెప్పులతో అదరగొట్టారు.
అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్(karimnagar additional collector) తన పుట్టిన రోజు సందర్భంగా చేసిన డాన్స్ పలువురిని ఆకట్టుకుంది. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో స్నేహితుల మధ్య ఆయన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. అదనపు కలెక్టర్ దంపతులు తమ సన్నిహితుల చప్పట్ల మధ్య డాన్స్ చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. స్వతహాగా కవి సమ్మేళనాలు, లలిత కళల పట్ల ఆసక్తిని కనబరిచే అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్(Sam prasad lal) తన నృత్యంతో ఆకట్టుకున్నారు.
గతంలో ఎంపీ కవిత స్టెప్పులు
గతంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం నాడు జరిగిన ఓ వివాహ వేడుకలో మరోసారి బుల్లెట్ బండి పాట(Bullet bandi song) వైరల్ అయింది. ఈ పాటకు మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత(MP Maloth kavitha) డ్యాన్స్ చేశారు. స్టేజీపై పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు, వారి కుటుంబ సభ్యులతో కలిసి నృత్యం చేశారు. నృత్యం చేసిన వీడియోలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో 'బుల్లెట్ బండి' పాట తెగ వైరలయింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నర్సు స్పెప్పులు
గతంలో బుల్లెట్ బండి పాట(Bullet bandi song) సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. స్వాతంత్య్ర దినోత్సవ సంబురాల్లో భాగంగా.. బుల్లెట్ బండి పాటకు ఓ నర్సు చేసిన డ్యాన్స్ చక్కర్లు కొట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లోని కారిడార్లో ఈ వీడియో తీశారు. పాటకు తగ్గట్టుగా సదరు నర్సు చేసిన డ్యాన్స్ వైరలయింది. పాటకు తగ్గ హావభావాలు ప్రదర్శించి తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. స్వాతంత్య్ర దినోత్సవ సంబురాల అనంతరం.. ఆటవిడుపుగా పాటకు సదరు నర్సు డ్యాన్స్ చేసినట్లు తెలిపారు. స్వాతంత్య్ర సంబురాల అనంతరం అందరం కలిసి ఉన్నప్పుడు సరదాగా ఆడిపాడినట్లు నర్సులు చెప్పారు. ఆసుపత్రి కారిడార్లో నృత్యాలపై అప్పట్లో పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: