భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నీటి పారుదల అవినీతి అధికారి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. కొండపర్తి వెంకటరామయ్య అనే గుత్తేదారు 2017లో మిషన్ కాకతీయలో భాగంగా రెండు చెరువుల్లో పనులు చేపట్టారు. వీటికి సంబంధించి బిల్లు ఇప్పించాలని దమ్మపేటలో నీటి పారుదల శాఖలో పనిచేస్తున్న నరసింహారావు వద్దకు వెళ్లారు. బిల్లు రావాలంటే రూ. 15 వేలు లంచం ఇవ్వాలని నరసింహారావు డిమాండ్ చేశాడు. వెంకటరామయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సత్తుపల్లిలోని ఆర్టీసీ బస్టాండ్లో నరసింహారావు డబ్బు తీసుకుంటుండగా వరంగల్ ఏసీబీ పట్టుకుంది.
ఇవీ చూడండి: ముంబయిలో భవనం కూలి నలుగురు మృతి