A Young Man Made An Electric Bike In Jagityal : ఆకాశాన్నంటుతున్న ఇంధనధరల నుంచి ఉపశమనం పొందడానికి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఈ యువకుడు. పాత పెట్రోల్ బైక్‌లను బ్యాటరీ బైకులుగా రూపొందిస్తున్నాడు. తనకు వచ్చిన ఆలోచనను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు. తొలుత తన వాహనాన్నివిద్యుత్ వాహనంగా మార్చుకున్న యువకుడు, ఫలితం బాగుండటంతో పలువురికి పెట్రోల్ బైకులు కాస్తా బ్యాటరీ బైకులగా మార్చి అందజేస్తున్నాడు. రాయపట్నం గ్రామానికి చెందిన మంచాల మహేష్ డిప్లొమా చదివాడు.
Electric Bike In Jagityal : సెల్‌టవర్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. వృత్తిలో భాగంగా ద్విచక్రవాహనంపై రోజు చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది. పెట్రోల్ ఖర్చు శక్తికి మించిన భారమైంది. విద్యుత్ వాహనమైతే ఇలాంటి సమస్యలు తగ్గుతాయి కదా అనుకున్నాడు. కానీ కొనే స్థోమత లేక తన దగ్గరున్న బైక్‌నే ఎలక్ట్రిక్ బైక్‌గా ఎందుకు మార్చకూడదని ఆలోచించాడు. తొలుత తన పాత ద్విచక్ర వాహనాన్ని బ్యాటరీ వాహనంగా మార్చాడు మహేష్. ఇది సక్సెస్ కావడంతో 15 వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చి వినియోగదారులకు అందించాడు.
కరీంనగర్ కుర్రోడు డిజైన్ చేసిన ఈ-బైక్ చూశారా..?
"ఎలక్ట్రిక్ బైక్ 250 కిలోమీటర్లు నడుస్తోంది. వాతావరణం కాలుష్యం, పెట్రోల్ ధర పెరగడం ద్వారా దీన్ని తయారు చేశాం. కరెంటు 150యూనిట్లు ఖర్చు అవుతుంది. రెండు రోజులకొకసారి ఛార్జింగ్ పెడతాను. ప్రతిరోజు 100 కి.మి బైక్ ప్రయాణం చేస్తాను. బ్యాటరీలలో లిథియంతో తయారు చేశాను. దీని జీవితకాలం 10 సంవత్సరాలు, ప్రమాదం జరగకుండా రూపొందించాను."-మహేష్, బైక్ ఆవిష్కర్త
Switch To Electric Vehicles At Low Cost : ఒకవైపు ఉద్యోగం చేస్తూనే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లాడు. తాను చేసిన ప్రయోగం చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. తక్కువ ధరలో ఎలక్టికల్ వాహనాలుగా మార్చి వారి ఆర్ధిక భారాన్ని తగ్గిస్తున్నాడు. గాలి కాలుష్యం ఇంతింతై అన్నట్టు రోజు రోజుకు పెరిగిపోతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన వచ్చింది. వాహనం ఇంజన్ తీసేసి అదేస్థానంలో బ్యాటరీ, వీల్‌లో మోటార్ అమర్చుతున్నాడు. బ్యాటరీలు పదేళ్ల వరకు గ్యారెంటీగా పనిచేస్తాయని చెప్తున్నాడు మహేష్.
ఎలక్ట్రిక్ బైక్‌గా పెట్రోల్ బండి- ఖర్చు కూడా తక్కువే!
Manchala Mahesh In Jagityal : ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారు 250కిలో మీటర్ల మేర ప్రయాణం చేయేచ్చు. ఇందుకు కేవలం 50రూపాయల విద్యుత్ ఖర్చు అవుతుందని చెబుతోన్నాడు. మహేష్ వాళ్లది వ్యవసాయ కుటుంబం. తన తండ్రికి పెట్రోల్ వాహానంతో ఆర్థిక ఇబ్బందులు అవుతున్నాయని గ్రహించి విద్యుత్త్ వాహనంగా మార్చాడు. దాంతో తాను సులభంగా వ్యవసాయ పనులు చేసుకుంటానని మహేష్ తండ్రి సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. వాహానాల బ్యాటరీల తయారీలో లెడ్ యాసిడ్ వాడకుండా ఎక్కువ సంవత్సరాలు మన్నిక ఉండే లిథీనియంను వాడుతున్నాడు.
10నుంచి 15 సంవత్సరాలు మన్నిక : ఈ బ్యాటరీలు పేలే అవకాశాలు చాలా అరుదు. అందువల్ల 10నుంచి 15 సంవత్సరాలు మన్నికగా ఉంటాయని అంటున్నాడు మహేష్. స్నేహితుడితో కలసి సోలార్, ఇన్వెర్టర్, ఇతర అవసరాల కోసం బ్యాటరీలు కూడా తయారు చేస్తున్నాడు. ఇంధన ఖర్చులు, పర్యావరణానికి మేలు చేయాలని ఉద్దేశ్యంతో ఈ వినూత్న ఆలోచన చేసినట్లు చెబుతున్నాడు మహేష్. ఫలితంగా చాలామంది స్థానిక ప్రాంతాల వారు పాత వాహనాలు తీసుకువచ్చి విద్యుత్త్ వెకిల్స్‌గా మార్చుకుంటున్నారని అంటున్నాడు. అయితే భవిష్యత్‌లో బ్యాటరీతో నడిచే వ్యవసాయ పని ముట్లను తయారు చేసే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నాడు.
పేలిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ.. మరో రెండు వాహనాలు దగ్ధం.. వారంలో రెండో ఘటన