కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు గ్రామంలో బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మహిళా అక్కడికక్కడే మృతిచెందింది. బట్టలు ఆరవేసే తీగకు విద్యుత్ సరఫరా కావడంతో కరెంట్ షాక్‌తో పెసరి భూమక్క మరణించింది.
భారీ వర్షాలకు...
మృతురాలి ఇంటి సమీపంలోని బావి వద్ద ఉన్న విద్యుత్ లైన్ పై భారీ వర్షాల కారణంగా చెట్టు కొమ్మ రాపిడి జరిగింది. అది కాస్త భూమక్క నివాసముంటున్న రేకుల షెడ్‌కి ఆనుకుంది.
గమనించని భూమక్క...
ఈ విషయం గమనించని భూమక్క ఉదయం స్నానం చేసి బట్టలు.. తీగపై అరేసే క్రమంలో రేకుల షెడ్‌కు ఆనుకుని ఉన్న తీగకు విద్యుత్ ప్రసరణ జరగడంతో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. దురదృష్టకరమైన ఈ సంఘటనతో మృతురాలి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.
భర్త, ఇద్దరు కుమారులు, కుమార్తె...
మృతురాలుకు భర్త, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇంట్లో పెద్ద దిక్కుగా ఉన్న భూమాక్క మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇవీ చూడండి : సీమ ఎత్తిపోతలపై తెలంగాణ వాదనలు వినేందుకు ఎన్జీటీ అంగీకారం