ETV Bharat / state

ఉపాధి హామీ కూలీలకు 30 శాతం అదనపు చెల్లింపులు - ఉపాధి హామీ కూలీలకు 30 శాతం అదనపు చెల్లింపులు

కరీంనగర్ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరానికి 55 లక్షల 28 వేల పని దినాలు లక్ష్యంగా నిర్దేశించినట్లు డీఆర్​డీఓ వెంకటేశ్వర రావు పేర్కొన్నారు.

UPADHI HAMEE MEETING
ఉపాధి హామీ కూలీలకు 30 శాతం అదనపు చెల్లింపులు
author img

By

Published : Apr 17, 2020, 8:43 PM IST

కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిషత్లో డీఆర్డీఓ ఉపాధి హామీ పనుల గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవిలో ఉపాధి హామీ కూలీలకు 30 శాతం అదనంగా చెల్లించనున్నామని డీఆర్​డీఓ వెంకటేశ్వర రావు వెల్లడించారు. లాక్​డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కూలీల రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూనే ప్రభుత్వ నిబంధనల మేరకు పనులు చేపట్టాలని సూచించారు. ఇంకుడు గుంతలు, పొలాల వద్ద ఫీల్డ్ చానల్స్, ఫీడర్ చానల్స్ , నీటి కుంటలు తదితర పనులను చేపట్టేందుకు ఉపాధి హామీ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అందరూ మాస్కులు ధరించే విధంగా జాగ్రత్త పాటించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ మంజులాదేవి, ఏపీవో చంద్రశేఖర్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి: లాక్​డౌన్​ వేళ 'కరోనా విందు'- ఒకరు అరెస్ట్​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.