ETV Bharat / state

కరీంనగర్​లో 280 మందికి ఆత్మనిర్భర్ భారత్ పథకం రుణాలు

author img

By

Published : Jul 24, 2020, 7:27 PM IST

ఉమ్మడి కరీంనగర్​ జిల్లావ్యాప్తంగా ఉన్న వీధి వ్యాపారుల గుర్తింపుతో పాటు వారికి రుణాలు ఇప్పించే ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. వీధి వ్యాపారాలు చేయడం వల్ల తమకు ఏ బ్యాంకు రుణాలు ఇవ్వడానికి ఆసక్తి చూపలేదని ప్రధానమంత్రి చేస్తున్న సాయం తమ కుటుంబాలను ఆదుకుంటోందని వీధి వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు.

కరీంనగర్లో 280 మందికి అందిన ఆత్మనిర్భర్ భారత్ పథకం రుణాలు
280Athma Nirbhar Bharath Loans Sanctioned In Karimnagar districtt

కరోనా కారణంగా ఉమ్మడి కరీంనగర్‌లోని చిరు వ్యాపారుల జీవనోపాధి అస్తవ్యస్తంగా మారింది. అలాంటి వారిని గుర్తించి ఆర్థికంగా ఆదుకునేందుకు ‘ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన వీధి వ్యాపారుల కోసం ఆత్మ నిర్భర్‌’ నిధి పథకం సూక్ష్మ రుణాలు పొందేందుకు అవకాశం కల్పిస్తోంది.

పట్టణాలు, నగరాల్లో చిరు వ్యాపారులు రుణాలు పొందడానికి తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటున్నారు. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని పురపాలిక, నగరపాలికల పరిధిలో వీధి వ్యాపారాలు వేల సంఖ్యలో ఉన్నారు. వీరిలో ఫుట్‌పాత్‌ వ్యాపారాలు చేసుకునే వారే అధికంగా ఉన్నారు. పండ్లు, టిఫిన్‌ సెంటర్లు, రహదారులపై కూరగాయలు, నిత్యావసర వస్తువులు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు.

లాక్‌డౌన్‌ సడలించినప్పటి నుంచి చిరు వ్యాపారుల జీవితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని కరీంనగర్ మేయర్ సునీల్ రావు తెలిపారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆర్థికంగా ఆసరా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందని.. ఆ క్రమంలో లబ్దిదారులను ఎంపిక చేసే ప్రక్రియ శరవేగంగా సాగుతోందని వెల్లడించారు.

కరోనా కారణంగా వ్యాపారమంతా దెబ్బతిన్నదని.. తిరిగి వ్యాపారం ప్రారంభిద్దామనుకున్నా చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి నెలకొందని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మ నిర్భర్‌ పేరుతో ఒక్కో చిరువ్యాపారికి రూ.10వేల చొప్పన రుణం సూక్ష్మ రుణాలు మంజూరు చేస్తోంది. ఈ మొత్తాన్ని ఏడాది లోపు ఏడు శాతం వడ్డీ రాయితీతో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది.

ఉమ్మడి జిల్లా పరిధిలో ఈనెల 1 నుంచి 21వతేదీ నాటికి 280మంది రూ.2.80కోట్లు రుణం తీసుకొని లబ్ధి పొందారు. పురపాలిక, నగరపాలికల్లోని వీధివ్యాపారులు ఆత్మ నిర్భర్‌ పథకం కింద రుణాలు పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మున్సిపాలిటీ జారీ చేసిన గుర్తింపుకార్డు, ఆధార్‌కార్డు, ఫోన్‌నంబర్‌, బ్యాంకుఖాతా వివరాలు సక్రమంగా ఉన్నట్లయితే అప్పటికప్పుడే బ్యాంకులకు ఆన్‌లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎక్కువ మంది చిరు వ్యాపారులకు ఆధార్‌కార్డు, ఫోన్‌నంబర్‌ అనుసంధానం విషయంలో సమస్యలు తలెత్తి రుణాల మంజూరులో జాప్యం జరుగుతోంది. ఈ నెల 24 వరకు ఉమ్మడి జిల్లాలోని పట్టణాలు, నగరాల్లో 3,941మంది వీధివ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 280మంది ఖాతాల్లో రూ.10వేలు జమయ్యాయి. మరికొంతమంది ఆ రుణం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని బ్యాంకుల్లో 3,688 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కొందరికి ఇప్పటికే రుణాలు మంజూరు కావడం వల్ల చిరువ్యాపారులు తిరిగి తమ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు. చిరువ్యాపారులకు నగరపాలక సంస్థ గుర్తింపు కార్డులు జారీ చేస్తుండటం వల్ల తమకు ఒక గుర్తింపు లభించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదీ చూడండి: కేటీఆర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.