కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంఛార్జి వడ్డేపల్లి సుభాశ్‌పై కాంగ్రెస్ మాజీ మహిళా మండల అధ్యక్షురాలు అరుణ ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున టికెట్ ఇవ్వకుండా.. తనతో అమర్యాదగా ప్రవర్తించాడని ఆరోపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అరుణ ఆరోపణలను ఖండించిన నాయకులు..
అరుణ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి ఖండించారు. మున్సిపల్ ఎన్నికల్లో అధిష్ఠానం టికెట్ నిరాకరించిందన్నారు. పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థికి మద్దతు తెలపకుండా... రెబెల్‌గా పోటీ చేసి అభ్యర్థి ఓటమికి కారణమైనందుకు అధిష్ఠానమే పార్టీ నుంచి తొలగించిందని తెలిపారు. పార్టీ నాయకులపై అసభ్య పదజాలంతో దూషించినందుకు ఆమెపై ఫిర్యాదు చేసినట్లు జనార్దన్‌రెడ్డి తెలిపారు.