నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కొవిడ్ సోకిన వారు పీపీఈ కిట్లు ధరించి మరీ ఓటేశారు. ఓటు వేసే 24 మందికి కొద్ది రోజుల క్రితం వైరస్ సోకింది. ఈ రోజు వారికి పరీక్ష నిర్వహించగా 8 మందికి నెగిటివ్ వచ్చింది. మిగతా 16 మందికి పాజిటివ్ ఉంది. వారిలో ఇద్దరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. మిగిలిన వారు పీపీఈ కిట్ ధరించి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం కేంద్రంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కేంద్రంలో భవానీపేట్ ఎంపీటీసీ రాజనర్సు పీపీఈ కిట్ ధరించి ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత కొద్ది రోజుల క్రితం కరోనా సోకటంతో ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్లో ఉంటున్నారు. ఇక్కడ అంటే తక్కువ మంది ఉన్నారు.
ఇదీ చదవండి: త్వరలోనే కవితక్క మంత్రి అవుతుంది: ఎమ్మెల్యే షకీల్